తరచూ బీట్రూట్ ను ఆహారంగా తీసుకోవడంతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు ముఖ్యంగా బీట్రూట్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు, యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని అల్పాహారం కంటే ముందే సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్రూట్లో అత్యధికంగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నియంత్రించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు క్యాన్సర్ కణాల నియంత్రణలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.బీట్ రూట్ జ్యూస్ ప్రతిరోజు సేవిస్తే శరీర దృఢత్వం పెరగడంతోపాటు మనలో అలసట, నీరసన్ని తొలగించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
బీట్రూట్లో అధిక కార్బోహైడ్రేట్స్ లభ్యమవుతాయి కావున డయాబెటిస్, ఉబకాయం, గుండెపోటు సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ రసంలో చక్కెరకు బదులు తేనె కలుపుకొని సేవిస్తే మంచిది.
బీట్రూట్ లో నైట్రేట్ నిల్వలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసి రక్తనాళాలను శుద్ధి చేస్తుంది దాంతో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
తరచూ మిమ్మల్ని వేధించే రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు ఒక గ్లాసుడు బీట్రూట్ రసాన్ని సేవిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది.తలసేమియా వ్యాధికి కూడా చక్కని పరిష్కారం లభిస్తుంది.ఎముకలు, కండరాల దృఢత్వాన్ని పెంచే కాల్షియం ను వినియోగించు కోవటంలో తోడ్పడే సైలీషియా మూలకం బీట్రూట్లో సమృద్ధిగా ఉంటుంది. కావున ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగితే ఆస్తరైటిస్, ఎముక బోలు వ్యాధి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.