కింద కూర్చొని తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ సమస్యలు దూరమవుతాయా?

మనలో కొంతమంది కింద కూర్చొని ఆహారం తినడానికి ఆసక్తి చూపిస్తే మరి కొందరు మాత్రం అలా తినడాన్ని నామోషీగ ఫీలవుతారు. అయితే వాస్తవం ఏంటంటే కింద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల అన్నో లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయి. కింద కూర్చొని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సుఖాసనంలో కూర్చుని ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

 

నేలపై కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల బీపీ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కుర్చీలో కూర్చుని తినేవారికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కింద కూర్చుని ఆహారం తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడకుండా ఆహారం తీసుకోవచ్చు. కింద కూర్చుని తినడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది.

 

బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులు రాకుండా అరికట్టడంలో కింద కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా బంధాలు బలపడే అవకాశాలు అయితే ఉంటాయి. కింద కూర్చుని ఆహారం తీసుకుంటే వేగంగా ఆహారం జీర్ణమవుతుంది. కింద కూర్చుని ఆహారం తీసుకునే వాళ్లలో బీపీ కంట్రోల్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.

 

నేలపై కూర్చుని ఆహారం తీసుకునే వాళ్లు సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటివరకు కూర్చుని తినే అలవాటు లేని వాళ్లు ఇకాఇనా ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.