న్యూట్రిషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజువారి డైట్ లో ఆకుకూరలను తింటే మన శరీరానికి శక్తినిచ్చి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఉండి అత్యల్ప క్యాలరీలు లభ్యమవుతాయి కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పాలకూరను సూప్, సలాడ్స్, జ్యూస్ రూపంలో అదనపు ఆహారంగా తీసుకోవచ్చు.
పాలకూరలో సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు లభిస్తున్నప్పటికీ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు,ఆస్తియోఫోరోసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం పాలకూరను అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.పాలకూరలో ఆక్సాలిన్ తో పాటు ప్యూరిన్ అనే మూలకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎముకల్లో పేరుకొని ఎముక కదలికలకు ఆటంకం కలిగిస్తుంది మరియు బలహీన పరుస్తుంది కావున ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి మరింత ఇబ్బందిని కలిగిస్తుంది కావున ఈ సమస్య ఉన్నవారు పాలకూరను ఆహారంగా తినకపోవడమే మంచిది.
పాలకూరలు సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ బి12 లభిస్తుంది. కావున సీజనల్ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు కనిపిస్తూ అవసరమైన రెటీనా పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. పాలకూర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు అత్యల్ప క్యాలరీలు ఉన్న ఆకుకూరను రోజువారి డైట్లో చేర్చుకుంటే సులువుగా శరీర బరువు నియంత్రించుకోవచ్చు.