సమ్మర్ సీజన్ లో మాత్రమే ఎక్కువగా లభించే పుచ్చకాయలను తినడానికి చాలామంది ఇష్టపడతారు.పుచ్చకాయలో అత్యధిక వాటర్ కంటెంట్ తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం,ఆమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభిస్తాయి.కావున అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి సీజన్లో డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవడానికి పుచ్చకాయలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. డిహైడ్రేషన్ సమస్య వల్ల తలెత్తే నీరసం, అలసట, కళ్ళు తిరగడం వంటి లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి కార్బోహైడ్రేట్స్ అధికంగా లభించే పుచ్చకాయను లేదా పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అయితే వేసవిలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే అన్ని కాయాలను ఫ్రిడ్జ్ లో పెట్టినట్లే పుచ్చకాయలను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తినడానికి ఇష్టపడతారు. పుచ్చకాయని ఫ్రిజ్లో పెట్టి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగం లేదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయని ఫ్రిజ్లో పెట్టి తింటే చల్లగా ఉంటుంది తప్ప దానిలో ఉన్న సహజ పోషకాలు అన్ని తగ్గిపోతాయట.
ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో బయటి వాతావరణం లో ఉంచిన పుచ్చకాయతో పోలిస్తే ఫ్రిజ్లో ఉంచిన పుచ్చకాయలో చాలా పోషకాలు సహజ స్థితిని కోల్పోయాయని చెబుతున్నారు. ఫ్రిజ్లో ఉంచిన పుచ్చకాయని తినడం మన ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే ఫ్రిజ్లో ఉంచిన పుచ్చకాయలు వారం పది రోజుల్లోనే పాడవుతాయి. అదే సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచిన పుచ్చకాయలు 14 నుంచి 21 రోజులపాటు తన సహజ గుణాలను కోల్పోకుండా అలాగే ఉన్నాయని పరిశోధనలో తేలింది. దీన్ని బట్టి చూస్తే పుచ్చకాయలను ఫ్రిజ్లో ఉంచి తినడం వల్ల ఎలాంటి ఫలితం లేదు అన్నది అర్థమవుతుంది.