మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి. వేసవి కాలంలో ఎక్కువగా లభించే ఈ పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. కొంతమంది వాటర్ యాపిల్ ను గులాబ్ జామూన్ కాయ అని మరి కొందరు రోజ్ యాపిల్ అని పిలుస్తారు. చిన్న గంట ఆకారంలో ఉండే వాటర్ యాపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉండే వాటర్ యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతారు. కొన్ని రకాల వాటర్ ఆపిల్స్ ఆకుపచ్చ రంగులో, కొన్ని రకాల వాటర్ ఆపిల్స్ మాత్రం పసుపు రంగులో ఉంటాయి. శరీరానికి అవసరమైన మినరల్స్, ఫైబర్స్ , విటమిన్స్, ప్రొటీన్లు , కార్బోహైడ్రేట్స్ వాటర్ యాపిల్ ద్వారా లభిస్తాయి. వాటర్ ఆపిల్ లో తక్కువ కొవ్వు మరియు క్యాలరీలు ఉంటాయి.
వాటర్ ఆపిల్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే జంబోలిన్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. వాటర్ యాపిల్ ద్వారా శరీరానికి అవసరమైన జింక్, విటమిన్ సి లభిస్తాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధ పడేవారు వాటర్ యాపిల్ తీసుకుంటే బీపీ అదుపులో ఉండి రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెప్పవచ్చు.
ఒత్తిడి, అలసటతో బాధ పడేవారు ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. వడదెబ్బతో బాధ పడేవారు వాటర్ యాపిల్ తినడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది. వాటర్ ఆపిల్ లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కు చెక్క్ పెట్టడంలో వాటర్ యాపిల్ ఉపయోగపడుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో వాటర్ యాపిల్ సహాయపడుతుంది.