మీకు ఇష్టమైన నెయ్యిని ఎక్కువగా తింటున్నారా.. మీరు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరు?

అన్ని రకాల ఆహార పదార్థాల్లో స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని తినడం మనందరికీ అలవాటే ఉంటుంది. ప్రతిరోజు తగిన మోతాదులో నెయ్యిని ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ప్రోటీన్స్,అమైనో ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. నెయ్యిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, లినోలిక్ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. వీర్యకణాభివృద్ధికి తోడ్పడుతుంది. క్యాన్సర్ కారకాలను తొలగించడంతోపాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే నెయ్యిని ఆహారంగా తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

నెయ్యి కొవ్వు ఆమ్లాలను అధికంగా కలిగి ఉంటుంది కావున జీర్ణ సమస్యలు ఉన్నవారు,గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధితో బాధపడేవారు నెయ్యిని ఆహారంగా తీసుకునే విషయంలో కచ్చితంగా వైద్య సలహాలు పాటించాలి.నెయ్యిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు
పదార్థం ఉండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో దాదాపు 115 కేలరీలు లభిస్తాయి. ప్రఖ్యాత అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం 2000 కేలరీల ఆహారం ఉన్న ఏ ఆరోగ్యకరమైన వ్యక్తికైనా.సంతృప్త కొవ్వు పదార్థాలను ఒక్క రోజులో 16 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. మనం తీసుకునే ఆహారంలో సంతృప్త కొవ్వు పరిమాణం ఎక్కువైనట్లయితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఈ అధ్యయనంలో పేర్కొనడం జరిగింది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ రోజువారి ఆహారంలో తక్కువగా తీసుకోవడమే మంచిది. నెయ్యి ఎక్కువగా తింటే వీటిలో ఉన్న సంతృప్తి కొవ్వులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచి రక్త ప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలిగించి రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు నెయ్యిని ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి ఉబకాయం సమస్య తలెత్తుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.