మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో రామఫలం తినే ఉంటారు. రామఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రామఫలంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొంతమంది ఈ పండ్లను ఇండియన్ చెర్రీ అని కూడా పిలుస్తారు. జామ్, జెల్లీ, ఇతర తీపి వంటకాల తయారీలో భాగంగా ఈ పండ్లను ఉపయోగిస్తారు. ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెఫ్టిక్ గుణాలు ఉన్నాయి.
ఈ పండ్లు తినడం వల్ల క్యాన్సర్, మలేరియా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఈ పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. టీ తయారు చేయడంలో కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు. ఈ పండ్లు తినడం షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచవచ్చు. ఈ పండ్లలో ఉండే పోషకాలు మొటిమలను సులువుగా తగ్గిస్తాయని చెప్పవచ్చు.
మెదడు కణాలలో అవసరమైన కెమికల్స్ ను స్థిరంగా ఉంచడంలో ఈ పండ్లలో ఉండే పిరిడాక్సిన్ తోడ్పడుతుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శరీరానికి ఎన్నో లాభాలను కలిగిస్తుంది. హానికర బ్యాక్టీరియా, వైరస్ నుంచి శరీరాన్ని రక్షించడంలో రామఫలం తోడ్పడుతుంది. ఈ పండ్లలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్లను సైతం ఈ పండ్లను తీసుకుంటే మంచిది.
ముఖంపై ముడతలు, మచ్చలు, చారలను నివారించడంలో రామ ఫలం తోడ్పడుతుంది. స్కిన్ రాషెస్, ఎగ్జిమా సమస్యలు సైతం ఈ పండ్లు తినడం వల్ల దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ నివారణలో ఈ ఫ్రూట్స్ ఉపయోగపడతాయి. ఈ పండ్ల పేస్ట్ ను తలకు రాయడం ద్వారా చుండ్రు, పేలు సమస్యలను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.