చేపలు మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ , మినరల్స్ ,ప్రోటీన్స్అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇతర మాంసాహారంతో పోలిస్తే చేపల్లో ఉన్న కొవ్వులు మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా లభిస్తుంది. కావున చేపలను ఆహారంగా తీసుకుంటే ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లం, విటమిన్ ఎ, డీ, ఈ సమృద్ధిగా లభించి గుండె, మెదడు, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఏ, కంటి ఆరోగ్యాన్ని రచించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరిచి కళ్ళు పొడిబారడం, కళ్ళు ఎర్రబడడం, రేచీకటి వంటి దృష్టి లోపాలను సవరించడంలో సహాయపడుతుంది.
చేపల్లో పుష్కలంగా ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని రక్షించి మనలో జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, అల్జీమర్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు సంబంధ వ్యాధులను అదుపు చేయడంలో సహాయపడుతుంది.
అతి బరువు సమస్యతో బాధపడేవారు చేపలను ఆహారంగా తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు
చేపలను ఆహారంగా తీసుకుంటే చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో చేపల్లో పుష్కలంగా ఉన్న ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లం అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన చెడు మలినాలను తొలగించి అధిక రక్తపోటు సమస్యను అదుపు చేయడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
చేపల్లో ప్రోటీన్స్ కేలరీలు ఎక్కువగా ఉంటాయి కావున ఉబకాయం గుండె సమస్యలతో బాధపడేవారు నూనెలో వేయించిన చేపలను, ఫిష్ కబాబ్, ఫిష్ రోస్ట్ వంటివి కాకుండా చేపలను పులుసు పెట్టుకొని తినడం ఆరోగ్యానికి మంచిది.