ఇడ్లీలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, అలెర్జీ ప్రతిచర్యలు, శక్తి తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇడ్లీలు మితంగా జీర్ణమవుతాయని చెప్పవచ్చు. ఇడ్లీలు ఎక్కువగా తింటే జీర్ణకోశంపై ప్రభావం చూపుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ప్రీబయోటిక్స్ లో తక్కువ ఉండటం వల్ల, శరీరంలోని మంచి బ్యాక్టీరియా పెరగడం కష్టం అయ్యే ఛాన్స్ ఉంటుంది.
పులియబెట్టిన ఆహారాలలో నిల్వ కోసం అధిక మొత్తంలో ఉప్పు మరియు చక్కెర ఉపయోగించవచ్చు. ఇది గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే అవకాశాలు ఉంటాయి. సాయంత్రం లేదా రాత్రి ఇడ్లీలు ఆలస్యంగా తినడం అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకోవాలి. ఇడ్లీలు ఎక్కువగా తినడం వల్ల శరీరం యొక్క జీవక్రియ మందగిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఫుడ్ సేఫ్టీ డిపార్టుమెంట్ సైతం ఇడ్లీలు ఎక్కువగా తినడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. హోటళ్లలో తెల్లగా మిలమిలా మెరిసే ఇడ్లీలు ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఇడ్లీలను తయారు చేయడానికి ప్లాస్టిక్ కవర్లను వాడటం వల్ల వీటి ద్వారా శరీరంలో ప్లాస్టిక్ చేరే చాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వేడిగా ఉన్న ఇడ్లీలు ప్లాస్టిక్ కవర్ల నుంచి హానికరమైన పదార్థాలను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్యాన్సర్ ను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీలు ఎక్కువగా తినేవాళ్లు దీర్ఘకాలంలో మధుమేహం బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.