క్రీమ్ బిస్కెట్స్ ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ బిస్కెట్లు ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది క్రిమ్ బిస్కెట్లను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. రుచిగా ఉండటంతో పాటు స్నాక్స్ కు క్రీమ్ బిస్కెట్స్ బెస్ట్ ఆప్షన్ అని చాలామంది భావిస్తారు. అయితే క్రీమ్ బిస్కెట్లు తినడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇవి తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. క్రీమ్ బిస్కెట్లను తినడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.

బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీయానిసోల్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోల్యూన్ లను ఉపయోగించి క్రీమ్ బిస్కెట్లను తయారు చేస్తారు. వీటిని వాడటం వల్ల శరీరానికి హాని కలిగే అవకాశాలు ఉంటాయి. క్రీమ్ బిస్కెట్స్ తినడం వల్ల గుండెపోటు, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. క్రీమ్ బిస్కెట్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

క్రీమ్ బిస్కెట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్లు మధుమేహం బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రీమ్ బిస్కెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశంతో పాటు మలబద్ధకం సమస్య వేధించే అవకాశాలు కూడా ఉంటాయి. సాల్ట్ బిస్కెట్లను తినడం వల్ల బీపీ పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

మైదా పిండితో తయారు చేసే క్రీమ్ బిస్కెట్ల వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. అందువల్ల మైదాపిండితో చేసిన వంటకాలకు దూరంగా ఉంటే మంచిది. క్రీమ్ బిస్కెట్లు తినే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఈ బిస్కెట్ల వల్ల ఆరోగ్యానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని వాళ్లు చెబుతున్నారు.