కొత్తిమీర తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఆ సమస్యలు దూరమవుతాయా?

మనలో చాలామంది కొత్తమీరను చిన్నచూపు చూస్తారు. అయితే కొత్తిమీర వంటకాలలో వేసుకుని తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అన్నీఇన్నీ కావు. కొత్తిమీర వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, గ్యాస్ లాంటి సమస్యలకు సులువుగా చెక్ పెట్టే విషయంలో కొత్తిమీర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

అల్సర్లు, పగుళ్లు, దుర్వాసన లాంటి సమస్యలు సైతం కొత్తిమీర తీసుకోవడం ద్వారా దూరమయ్యే ఛాన్స్ ఉంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడంలో కొత్తిమీర ఎంతగానో సహాయపడుతుంది. మంటలు, నొప్పులు దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టే విషయంలో క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి జరగకుండా చేసే విషయంలో కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది.

శరీరంలోని సోడియంను బయటకు పంపించడంలో కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ కణాలను దెబ్బ తీయకుండా చేయడంలో కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుంది. కొత్తిమీరలో వృద్ధాప్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ కే శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా చేసే విషయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

వాతాన్ని తగ్గించడంలో కొత్తిమీర తోడ్పడుతుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడేవారు కొత్తిమీర తీసుకోవడం వల్ల ఆ సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పులకు చెక్ పెట్టే విషయంలో కొత్తిమీర ఆకులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. కొత్తిమీర తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది.