రుచి కోసం వీటిని ఎక్కువగా తింటే! మీ ఆరోగ్యాన్ని గుల్ల చేసే ప్రమాదం ఉంది… జాగ్రత్త పడండి!

healthy-people-salad-food-woman-1024x683

మనం తినే ఆహారం రుచిగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని పదార్థాలను వంటకాలు ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. అయితే వీటివల్ల మన ఆరోగ్యానికి ముప్పు ఉందన్న విషయం చాలామందికి అవగాహన ఉండదు. అసలు మన ఆరోగ్యానికి అంత నష్టం కలిగించే వంటింటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన వంటింట్లో ఉండే ఉప్పు మన శరీరంలో మోతాదుకు మించితే మన ఆరోగ్యానికి ప్రధాన శత్రువుగా మారుతుంది. వంటకాల్లో రుచికోసం టేస్టీ సాల్ట్, మసాలా దినుసులను ఎక్కువగా వినియోగిస్తే
రక్తంలో సోడియం పరిమాణం పెరిగి అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది. తద్వారా అనతి కాలంలోనే గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే మనం తీసుకునే ఆహారంలో సోడియం శాతం ఎక్కువైతే కిడ్నీ పనితీరు దెబ్బతిని కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తవచ్చు.

ఈ రోజుల్లో మనందరం ఫ్రైడ్ రైస్ లకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి వీటిని తినడానికే ఇష్టపడుతున్నాం ఫలితంగా వంటనూనెలను మోతాదుకు మించి ఆహారంలో తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉబకాయం, డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు ప్రమాదాలు పెరిగిపోతాయి.మోతాదుకు మించి చక్కెరను ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్,ఉబకాయం, కండరాల బలహీనత, మెదడు పనితీరు లోపించడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

రోజువారి ఆహారంలో మైదా పిండితో తయారు చేసే బ్రెడ్, పరోట, పిజ్జా ,బర్గర్ వంటివి ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని అనేక సర్వేలో వెళ్లడైంది.ముఖ్యంగా మైదాపిండి జీర్ణం కావడానికి అధిక సమయం తీసుకుంటుంది కావున మలబద్ధకం, గ్యాస్టిక్, అజీర్తి సమస్యలు తలెత్తడమే కాకుండా, ఉదర సంబంధిత క్యాన్సర్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున రోజు వారి ఆహారంలో ఉప్పు, కారం ,మసాలా, కొవ్వు పదార్థాలు, మైదా పిండిని తగిన మోతాదులో తీసుకుంటే మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు.