ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ నీళ్ల వల్ల ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది వేర్వేరు సందర్భాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగితే ఎన్నో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఎన్నో హానికర రసాయనాలు ఉంటాయి. కాడ్మియం, సీసం, పాదరసంతో పాటు థాలేట్స్, బీపీఏ, ఇతర ప్రమాదకర రసాయనాలు ఉంటాయి.

ప్లాస్టిక్ బాటిళ్లకు వేడి తగిలితే ప్రమాదకర రసాయనాలు నీళ్లలో చేరే అవకాశం అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల హార్మోన్ ఇమ్ బ్యాలెన్స్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నానో ప్లాస్టిక్స్ అనే సూక్శ్మ కణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పవచ్చు.

మనం తాగిన నీళ్లు రక్తంలో కలవడం ద్వారా నేరుగా శరీర భాగాలకు చేరే అవకాశం అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా కాపర్, సిరామిక్ బాటిల్స్ ను ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లలో పిల్లలు నీళ్లు తాగడం వల్ల అరుదైన ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. మట్టికుండలోని నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.