ఉదయం లేవగానే రుచికరమైన వేడివేడి మంచి కాఫీ ,టీ నీ తాగడం మన అందరికీ అలవాటే. అధిక ఒత్తిడితో ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ, టీ ని తాగితే మానసిక ఆందోళన తొలగి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బ్లాక్ కాఫీ నీ తగిన మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్లాక్ కాఫీ ని మోతాదుకు మించి తీసుకుంటే వీటిలో అధికంగా ఉన్న కెపిన్ అనే ఆల్కలాయిడ్ గుండె ,మెదడు, నాడీ కణాల వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వైద్య నిపుణుల సూచనల ప్రకారం రోజుకు 1 లేదా 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే మన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. బ్లాక్ కాఫీలో ఎక్కువగా ఉన్న కెఫెన్ నాడీ కణ వ్యవస్థను ప్రేరేపించి మెదడును చురుగ్గా ఉంచుతుంది. దాంతో తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడి మానసిక ప్రశాంతత తో పాటు అలసట, నీరసం , నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.
బ్లాక్ కాఫీని రోజుకు మూడు కప్పుల మించి తాగే వారిలో కెఫిన్ ఆల్కలాయిడ్ మోతాదుకు మించి ఉండడంవల్ల నాడీ కణ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాంతో మెదడు పనితీరు దెబ్బతిని డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కెఫిన్ ఎక్కువగా తీసుకునే వారిలో నిద్రలేమి సమస్య అధికంగా ఉందని అనేక అధ్యయనాల్లో పేర్కొనడం జరిగింది.
దీర్ఘకాలం పాటు డిప్రెషన్, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డిమెన్షియా అనే మానసిక సమస్య తలెత్తవచ్చు.దీని బారిన పడిన వారు మానసికంగా కృంగిపోయి సాధారణ మనుషుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మోతాదుకు మించి కాపీని తాగితే కాఫీలు అధికంగా ఉన్న కెపిన్ అనే పదార్థం అధిక రక్తపోటు సమస్యకు దారితీసి గుండె సమస్యలను అధికం చేస్తుంది. ముఖ్యంగా హై బీపీ, షుగర్, గుండె జబ్బుల సమస్యతో బాధపడేవారు కాఫీని తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.