ఉదయాన్నే తేనె పానీయాన్ని సేవిస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

why-drinking-warm-water-with-honey-is-good-for-health

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తేనెను మన రోజువారి ఆహారంలో ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే తేనెను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని సేవిస్తుంటారు. దీనివల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు అతి బరువు సమస్య, డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్, ఫ్లూ లక్షణాల నుంచి తొందరగా బయటపడవచ్చు.

ప్రతిరోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని సేవిస్తే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నీ పూర్తిస్థాయిలో స్థాయిలో నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీర బరువు తగ్గి ఉబకాయ సమస్యకు స్వస్తి పలకవచ్చు.అయితే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే తేనె నిమ్మరసం నీటిలో వేసి బాగా మరిగించి లెమన్ టీ అంటూ తాగుతుంటారు. దీనివల్ల మీకు ఎలాంటి అంటే ఆరోగ్య ప్రయోజనాలు లభించవు. ఎందుకంటే తేనెను మరిగిస్తే అందులో ఉండే ఔషధ గుణాలు నశించిపోతాయి. కావున తేనె పానీయాన్ని సేవించాలనుకుంటే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం మంచిది.

మలబద్ధకం గ్యాస్ట్రిక్ అజీర్తి ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని సేవిస్తే కడుపులో ఉండే చెడు మలినాలు తొలగిపోయి పేగు కదలికలు మెరుగుపడతాయి తద్వారా తిన్న ఆహారం తొందరగా జీర్ణమై జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా వేసవికాలంలో తొందరగా శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది కావున ప్రతిరోజు ఉదయాన్నే తేనె పానీయాన్ని సేవిస్తే రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంచి అలసట నీరసం బండి లక్షణాలను తొలగిస్తుంది. ఆందోళన మానసిక ఒత్తిడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని సేవిస్తూ మెదడు కండరాలపై ఒత్తిడి తగ్గి మానసిక ఆనందం కలుగుతుంది. తేనె ఆరోగ్యమే అయితే మోతాదుకు మించి తీసుకుంట మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావం పడవచ్చు.