ఉబకాయం, డయాబెటిస్ వ్యాధి లక్షణాల నుంచి జీవితకాలం పాటు రక్షణ పొందాలంటే ఇది తాగాల్సిందే!

ప్రతిరోజు ఉదయాన్నే టీ, కాఫీ వంటి పానీయాలకు బదులు రాగి జావా లేదా రాగి అంబలిని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.మన పూర్వీకులు రోజువారి ఆహారం రాగి, కొర్రలు,జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాన్ని ఉపయోగించి వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. ప్రస్తుతం మనం ఆధునిక పోకడలతో ఫాస్ట్ ఫుడ్ కు బానిసై 40 సంవత్సరాలకే వృద్ధాప్య లక్షణాలతో బాధపడుతున్నాం. ఇలాంటి అనారోగ్య లక్షణాల బయటపడాలంటే రోజువారి ఆహారంలో రాగి జావా, రాగి రొట్టె ,రాగి సంగటి వంటి ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.

మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకునే బియ్యం, గోధుమల్లో కంటే రాగి చిరుధాన్యంలో మన శరీర పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం, ఐరన్ , జింక్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు దాదాపు 35 రేట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు రాగి అంబలి తాగితే రాగుల్లో పుష్కలంగా ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం త్వరగా జీర్ణం అవ్వదు. కడుపు నిండిన భావన కలిగి ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తగ్గించుకోవచ్చు. రాగి చిరుధాన్యంలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకల అరుగుదలను నివారించి దృఢంగా ఉంచినట్లు చేస్తుంది. రాగుల్లో పుష్కలంగా ఉన్న ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.

రాగి చిరుధాన్యంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ అత్యధికంగా లభ్యమవుతుంది. కావున డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే రాగి జావాను సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు నియంత్రించబడి డయాబెటిస్ వ్యాధి నియంత్రణ ఉంచుతుంది.రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది తద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది..