ఈ శరీర భాగాలను తాకితే ఇన్ఫెక్షన్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది హెల్త్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. శరీరంలోని కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం పదేపదే ముఖం అస్సలు తాకకూడదు. ముఖం పదేపదే తాకడం వల్ల మొటిమలు, పిగ్మెంటేషన్, దురద లేదా దద్దుర్లు లాంటి ఇతర సమస్యలు వస్తాయి. చేతుల్లో ఉండే సహజ నూనె ముఖం రంధ్రాలను మూసివేసేలా చేస్తుందని చెప్పవచ్చు.

చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలని భావించే వాళ్లు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చెవుల్లో వేళ్లు పెట్టుకునే అలవాటు కూడా మంచిది కాదు. చెవులలో పిన్నీస్ లు, దూదితో ఉన్న ఇతర వస్తువులను పెట్టుకోవడం వల్ల చెవులకు హాని కలుగుతుంది. చెవులలో వస్తువులను పెట్టుకోవడం వల్ల టింగ్లింగ్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ముక్కు, నోరులో వేలు పెట్టుకోవడం కూడా చాలా పెద్ద చెడ్డ అలవాట్లలో ఒకటి. ఈ విధంగా చేయడం ద్వారా ముక్కు, నోటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఈ అలవాట్ల వల్ల డయేరియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కళ్లను పదేపదే నలపడం కూడా మంచి అలవాటు కాదు. ఈ విధంగా చేయడం వల్ల కళ్లు ఎర్రగా మారే అవకాశాలు అయితే ఉంటాయి.

మన శరీరంలోని సున్నితమైన అవయవాలలో కళ్లు ఒకటనే సంగతి తెలిసిందే. కళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. కళ్లకు సంబంధించి ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ విషయాలను గుర్తుంచుకోవడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు.