Mangeo: మామిడి పండు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి!

వేసవి కాలం వచ్చింది అంటే చాలు మామిడి పండ్లు మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మార్కెట్లో రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా కూడా మామిడి పండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. ఈ మామిడి పండ్లను చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటూ ఉంటారు. అయితే మామిడి పండ్లు తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తినడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా వేసవి కాలంలో మామిడి పండ్లు మితిమీరి తింటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలు అస్సలు తినకూడదు అంటున్నారు వైద్యులు.

మరి ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఇందులో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌, పెక్టిన్‌ వంటివి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. విటమిన్‌ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మామిడి పండు తిన్న వెంటనే పెరుగు తినకూడదు. ఇలా చేస్తే కడుపులో కార్బన్‌ డై ఆకైడ్‌ పరిమాణం పెరిగి కడుపు నొప్పికి దారితీస్తుంది.

అలాగే మామిడి పండ్లు తినే ముందు, తిన్న తర్వాత నిమ్మకాయ, నారింజ, కమల వంటి సిట్రస్‌ పండ్లు తీసుకోకూడదు. ఇది శరీరంలోని pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మామిడిపండు తిన్న వెంటనే, తినక ముందు స్పైసీ ఫుడ్ తింటే ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. కాకరకాయ తిన్నా తర్వాత తినే ముందు కాకరకాయ చేసిన పదార్థాలు కాకరకాయ తీసుకోకూడదు. కేవలం ఇవి మాత్రమే కాకుండా కూల్ డ్రింక్స్ మంచినీళ్లు వంటివి కూడా అసలు తీసుకోకూడదు. ఇలా చేస్తే పలు రకాల సమస్యలను ఎదుర్కోక తప్పదు.