మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆహారం తీసుకునే ముందు తీసుకున్న తర్వాత నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
అన్నం తీసుకునే అరగంట ముందు.. తిన్న అరగంట తర్వాత నీరు తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండవు. ఫుడ్ తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగితే తిన్న ఫుడ్ త్వరగా జీర్ణం కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే నీరు తీసుకోవడం వల్ల జీర్ణరసాలు పలుచగా మారి జీర్ణ సమస్యలు ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఈ విధంగా చేయడం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తినే అరగంట ముందు, ఫుడ్ తీసుకునేటప్పుడు, అన్నం తీసుకున్న అరగంట తర్వాత నీరు తీసుకోవడం ద్వారా కొత్త సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.