ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనుషుల జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక బయట దొరికే జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల తొందరగా బెల్లీఫ్యాట్ వచ్చేస్తోంది. ఇలా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అధిక శరీర బరువు పెరగడం కాకుండా, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఇక కొంతమంది అయితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది మెడికల్ పరంగా వైద్యులు కూడా సంప్రదిస్తున్నారు.
మరి అలాంటి వారికోసం మన ఇంట్లో దొరికే వాటితోనే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకోబోయే చిట్కాను పాటిస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఫిట్ గా కూడా ఉంటుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఈ పొడిని వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదేవిధంగా హెల్దీగా కూడా ఉంటారు. మరి ఆ పొడికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, నువ్వులు, దాల్చిన చెక్క, కలోంజీ సీడ్స్. ఈ నాలుగు పదార్థాలు సమ పరిమాణంలో తీసుకొని మిశ్రమంలా తయారు చేసుకోవచ్చు.
ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం అర టీ స్పూన్ పొడిలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి శరీరం మంచి శరీరాకృతిని కలిగిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యానికి మరియు అవయవాల పనితీరుకి ఈ పొడి బాగా సహాయపడుతుంది. సహజ చిట్కాలతో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది.