కలోంజి విత్తనాలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ సమస్యలు దూరమవుతాయా?

మనలో చాలామంది కలోంజి సీడ్స్ గురించి ఏదో ఒక సందర్బంలో వినే ఉంటారు. కలోంజి సీడ్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి. కొంతమంది కలోంజి విత్తనాలను నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో కూడా కలోంజి విత్తనాలను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉంది.

శరీరంలో ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో ఈ విత్తనాలు సహాయపడతాయి. కలోంజి విత్తనాలను షాజీరా అని కూడా పిలుస్తారు. ఈ విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్పరస్ లభిస్తాయి. కలోంజి విత్తనాలు తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సప్లమెటరీ గుణాలు లభించే అవకాశాలు ఉంటాయి.

ఇవి తీసుకోవడం ద్వారా వ్యాధులు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో కలోంజి విత్తనాలు తోడ్పడతాయి. ఈ విత్తనాలు తీసుకోవడం ద్వారా జలుబు దగ్గు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రక్తసరఫరాను క్రమబద్దీకరించడంలో ఈ విత్తనాలు ఉపయోగపడతాయి.

హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి జీర్ణాశయాన్ని కాపాడటంలో ఈ విత్తనాలు ఉపయోగపడతాయి. కలోంజి విత్తనాలు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కలోంజి విత్తనాలను మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది.