Omicron: ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందటానికి కారణాలేంటి? ఆసక్తికర విషయాలు బయట పెట్టిన శాస్త్రవేత్తలు..!

Omicron:ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వెరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దక్షిణ ఆఫ్రికాలో కనుగొన్న ఈ వేరియంట్ ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలలో వ్యాప్తి చెందింది. ఇది డెల్టా వేరియంట్ సృష్టించినంత నష్టం కలిగించక పోయిన కూడా ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందటం ఆందోళన కలిగించే విషయం. డెల్టా వేరియంట్ లో ఉన్న మ్యూటెంట్స్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ లో 3 రెట్లు అధికంగా మ్యూటెంట్స్ ఉండటం వల్ల ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారతదేశంలో ఇప్పటికే పదివేల ఒమిక్రాన్ కేసులు దాటాయి. ఒమిక్రాన్ ప్రభావాన్ని తట్టుకోగల రోగ నరోధకశక్తి భారతీయులలో ఉండటం వల్ల ఇది మన దేశం మీద ఎక్కువ ప్రభావం చూపలేకపోతోంది.

ఒమిక్రాన్ ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ చేయడం ఒకటే మార్గం. దీని టెస్ట్ ఫలితం రావడానికి దాదాపుగా రెండు నుండి మూడు రోజుల సమయం పడుతుంది. కరోనా అనేది ఒకరి నుండి ఒకరికి సంక్రమించే అంటూ వ్యాధి. ఈ టెస్ట్ యొక్క ఫలితం వచ్చేలోపు ఇది వేగంగా ఇస్తరులకు సంక్రమిస్తుంది. జపాన్ శాస్త్రవేత్తల ఒక పరిశోధన ప్రకారం ఒమిక్రాన్ వైరస్ మిగిలిన వేరియంట్ ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది.

ప్లాస్టిక్ వస్తువుల మీద ఎనిమిది రోజులు, మనుషుల శరీరం మీద 21 గంటల సేపు ఒమిక్రాన్ జీవించగలదట. చైనాలోని ఊహన్ లో మొదట గుర్తించిన వైరస్ కంటే అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ లు రెండు రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయట.

ఇతర వేరియంట్ లతో పోలిస్తే ఒమిక్రాన్ లో ఉన్న మ్యూటెంట్స్ కారణంగా ఇది ఎంతో వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం కూడా జాగ్రత్త పడి త్వరగా వాక్సిన్ అందరికీ చేరవేయడం వల్ల కూడా ఒమిక్రాన్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది డెల్టా వేరియంట్ సృష్టించిన నష్టాన్ని కూడా కలుగజేయవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కరోనా, దాని వేరియంట్ ల యొక్క మూలాలు కనుగొని దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయి.