ఏడాది పొడవునా అన్ని కాలాల్లో సమృద్ధిగా లభించే చేపలను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి , ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే శీతాకాలంలో చేపలను ఎక్కువగా తింటే మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇతర మాంసాహారంలో ఉన్న కొవ్వు పదార్థాల కంటే చేపల్లో లభించే ఒమేగా ఫ్యాటీ కొవ్వు పదార్థాలు మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.
మన శరీరంలో సొంతంగా ఉత్పత్తి కానీ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్ల వంటి తొమ్మిది రకాల అమినో ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా లభిస్తాయి. కావున శ్వాస సంబంధిత అలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే శీతాకాలం లాంటి సీజన్లలో చేపలను ఆహారంగా తీసుకుంటే వీటిల్లో అధికంగా లభ్యమయ్యే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున దగ్గు జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడేవారు చలికాలంలో చేపలను ఎక్కువగా తినడమే మంచిది.
చలికాలంలో చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఏ, కంటి ఆరోగ్యాన్ని రచించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కావున శీతాకాలంలో తలెత్తే కళ్ళు ఇన్ఫెక్షన్లను,కళ్ళు పొడిబారడం, కంటి నుంచి నీరు కారణం వంటి సమస్యలు తగ్గి కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరుడు మెరుగుపరుస్తుంది.
మెదడు ఆరోగ్యాన్ని రక్షించి మనలో జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, అల్జీమర్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు సంబంధ వ్యాధులను అదుపు చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో గుండె సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలాంటివారు తరచూ చేపలను ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడి ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చేపలు సమృద్ధిగా లభిస్తాయి.చలికాలంలో చర్మం పొడివారి సహజ గుణాన్ని కోల్పోతుంది. కావున చేపలను ఎక్కువగా తింటే చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు,విటమిన్ ఏ, విటమిన్ ఇ, చర్మం లోని తేమ శాతాన్ని కోల్పోనివ్వకుండా సహాయపడి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది.