Sitara: ఓయమ్మా సితారకు కూడా అలాంటి వింత జబ్బు ఉందా….. అలా అయితే కష్టమే మరీ?

Sitara: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మహేష్ బాబు కుమార్తెగా అందరికీ ఎంతో సుపరిచితమే అతి చిన్న వయసులోనే సితార తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా భారీ స్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..

సితార అతి చిన్న వయసులోని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ వేదికగా ఎన్నో పాటలకు డాన్సులు చేస్తూ వీడియోలు షేర్ చేశారు. అలాగే ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ అంటూ అన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు తన తండ్రి సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక ఇంత చిన్న వయసులోనే సీతార ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

నటన పట్ల సితారకు ఉన్న ఆసక్తి చూస్తుంటే ఈమె అతి త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక మహేష్ బాబు నమ్రత సైతం సితారను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయటానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా సితార ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే విషయం అభిమానులకు ఆనందాన్ని కలుగజేస్తున్న మరో వార్త కూడా అభిమానులను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలు కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నారు అలాగే ఇంత చిన్న వయసులోని సితార కూడా అలాంటి ఒక సమస్యతో బాధపడుతుందట. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల వారికి చర్మ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే సితారకు సైతం ఓ చర్మ సమస్య ఉందని తెలుస్తుంది. సితారకి టూ హీట్ అస్సలు పడదట. మరి ముఖ్యంగా కొంచెం చెమట వచ్చిన సరే స్కిన్ మొత్తం రాషెస్ వచ్చేసి ..ఎర్రగా దద్దుర్లు వచ్చేస్తాయట . ఇదే వ్యాధి మహేష్ బాబుకి కూడా ఉండిందట. ఇలా నాన్న నుంచి ఈ వ్యాది కూతురికి వచ్చిందని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.