అధిక శరీర బరువుతో సతమతమయ్యేవారు కొందరైతే మరికొందరు శరీర బరువు తక్కువగా ఉండి రోజువారీ కార్యకలాపాల్లో తీవ్రమైన ఒత్తిడి, నీరసం, అలసట వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు రోజువారి ఆహారంలో ఇప్పుడు చెప్పబోయే పండ్లను ఆహారంగా తీసుకుంటే శరీర బరువు పెరగడమే కాకుండా శారీరక మానసిక ధూడత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువగా తింటే మీ ఒంట్లో క్యాలరీలు, ప్రోటీన్స్ అధికమై శరీర బరువు నియంత్రణ తప్పి ఊబకాయ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఒంట్లో శక్తి కోల్పోయి పోషకాహార లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు అరటి పండ్లను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన క్యాలరీలు, ప్రోటీన్స్ సమృద్ధిగా లభించి తక్షణ శక్తి లభించడమే కాకుండా త్వరగా శరీర బరువు పెంచుకొని శారీరక దృఢత్వాన్ని పొందవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లను తినే విషయంలో కచ్చితంగా వైద్య సలహాలు తీసుకోవాలి. శరీర బరువు పెంచుకోవాలనుకునే వారికి అవకాడో ఉత్తమమైన ఆహారం. ఇందులో అత్యధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్, మంచి కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి.
బాగా పండిన మామిడి పండ్లలో సమృద్ధిగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాలరీలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. అయితే జీర్ణ సమస్యలతో బాధపడేవారు మామిడి పండ్లను తక్కువగా తినాలి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తింటే అజీర్తి సమస్య తీవ్రమౌతుంది. శారీరక దృఢత్వాన్ని పొంది సహజ పద్ధతిలో శరీర బరువును నియంత్రించుకోవాలంటే ప్రతిరోజు నాలుగు ఖర్జూర పండ్లను తింటే సరిపోతుంది. ప్రతిరోజు అత్యధిక కేలరీలు ఉన్న ద్రాక్షను ఆహారంగా తింటే సహజ పద్ధతిలో శరీర బరువును పెంపొందించుకోవచ్చు. బాదంపప్పును నానబెట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఆహారంగా తీసుకుంటే మన శారీరక దృఢత్వానికి సహాయపడే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి.