పాదాల్లో పగుళ్లు ఏర్పడి రక్తస్రావం, భరించలేని నొప్పి కలుగుతోందా అయితే ఇలా చేయండి!

female bare feet on white background

పాదాల్లో పగుళ్లు తీవ్రమైన నొప్పి సమస్యల నుంచి బయటపడే మార్గాల గురించి తెలుసుకునే ముందు అసలు పాదాల్లో పగుళ్లు ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకుందాం.మన శరీర బరువు మొత్తం పాదాలపైనే పడుతుంది అందుకు అనుగుణంగానే పాదాల అమరిక చర్మం, కండరాలు చాలా దృఢంగా ఉంటాయి. అయితే కొందరిలో కొన్ని కారణాలవల్ల పాదాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్, పోషకాలు సరిగా అందక చర్మం దళసరిగా మారి పగుళ్లు ఏర్పడతాయి.

మరికొందరిలో అధిక శరీర బరువు కారణంగా పాదాలపై భరించలేని ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడవచ్చు. చాలామంది పాదాల పగుళ్లను పెద్దగా పట్టించుకోరు దీని మూలంగా చర్మం లోకి తడి, ధూళి కణాలు చేరి ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి చెంది గాయంగా మారుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి రక్తస్రావం కూడా కలగవచ్చు. పాదాల పగుళ్ల సమస్య మహిళలని ఎక్కువగా వేధిస్తుంది.ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

తీవ్రమైన పాదాల నొప్పి, పగుల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో పాదాలపై మర్దన చేసుకుంటే ఇందులో ఉండే యాంటీ మైక్రోవేల్ , యాంటీ సెప్టిక్ గుణాల కారణంగా గాయాలు త్వరగా మాని నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా పాదాల చర్మం మృదువుగా తయారవుతుంది. పైనాపిల్ పండును మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జును పాదాల పగుళ్ళపై రాసి 45 నిమిషాల పాటు వదిలేయాలి. పైనాపిల్ లో ఉండే ఆమ్ల గుణాలు పగుళ్లలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిపోయేలా చేస్తాయి.పగుళ్లు కూడా తగ్గుతాయి.రోజులో పావుగంటసేపు పాదాలను చల్లని నీరు నింపిన బకెట్లో ముంచి ఉంచాలి. తరువాత పగుళ్ల భాగంలో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగి పాదాలు మృదువుగా తయారవుతాయి.