ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోందా.. మీరు ప్రమాదంలో పడినట్లే?

మారుతున్న ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం జన్యు సంబంధమైన కారణాలతో చిన్న వయసులోని ఎముకల సమస్యలు తలెత్తుతున్నాయని అనేక పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్థియోఫోరోసిస్ అనే ప్రమాదకర వ్యాధి ఈనాటి యువతరాన్ని ఎక్కువ కలవర పరుస్తోంది. ఆస్తియోఫోరోసిస్ అంటే ఎముకలు వాటి సహజ దృఢత్వాన్ని కోల్పోయి బోలుగా మారడాన్ని ఆస్తియోఫోరోసిస్ అంటారు.ఈ వ్యాధి సోకితే ఎముకలు పెళుసుగా మారి తొందరగా విరిగిపోతాయి.

ముఖ్యంగా కీళ్ల నొప్పులు,వెన్నునొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగితే తప్పనిసరిగా ఎముక సాంద్రతకు సంబంధించిన టెస్టులు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకల సాంద్రత,దృఢత్వం కోల్పోయిన వారు టెస్టోస్టిరాన్ థెరపీ చేయించుకుంటే ఎముకల సాంద్రతను పెంచుతుంది. అలాగే మన రోజు వారి ఆహారంలో ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి అలవాటు చేసుకుంటే ఎముకలు దృఢంగా మారడంతో పాటు వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల సంబంధం వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు.

ఆర్థరైటిస్,ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించుకోవాలంటే సమృద్ధిగా విటమిన్ డి అవసరమవుతుంది.విటమిన్ డి లోపాన్ని సవరించుకోవాలంటే రోజువారి ఆహారంలో పాలు, పెరుగు ,గుడ్లు, బ్రోకలీ, ఆకుకూరలు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకుంటూనే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకే విధంగా ఆరు బయట గడిపితే విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజు నారింజ పండ్లను జ్యూస్ రూపంలో రెండు పూటలా సేవిస్తే మన శరీరానికి అవసరమైన విటమిన్ సి క్యాల్షియం అధికంగా లభ్యమవుతుంది. ఎముకల దృఢత్వానికి పెరుగుతులకు అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఖర్జూర పండ్లు, బాదం, వేరుశెనక్కాయలు, సన్ ఫ్లవర్ గింజలు వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.