మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే? ప్రతిరోజు ఈ గడ్డి జ్యూస్ తాగాల్సిందే!!

గోధుమగడ్డిని సూపర్‌ ఫుడ్‌ అని పోషకాహార నిపుణులు అంటారు. గోధము గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్, కాల్షియం, ఎంజైమ్‌లు, మెగ్నీషియం, 17 అమైనో యాసిడ్స్‌ , విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గోధమ గడ్డి జ్యూస్‌ క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసుడు గోధుమ గడ్డి రసాన్ని సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ సి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను సమర్ధవంతంగా తొలగించి హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.గోధుమగడ్డి జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి , చెడు కొవ్వు ఉండదు.మీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది తద్వారా తొందరగా అతి బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

గోధుమ గడ్డి రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు సీజనల్గా వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కొని మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. వీటిలో పుష్కలంగా ఉన్న ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తొలగించడంతోపాటు నాడీ కణ వ్యవస్థను ఉత్తేజపరిచి మెదడు చురుకుదనాన్ని జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.