దిష్టికి పరిష్కారం కావాలా.. అయితే ఓసారి ఇలా ప్రయత్నించండి!

దిష్టి దోషాలను ఎలా గుర్తించవచ్చు అంటే మన ఇంట్లో ఏదైనా మంచి జరిగినప్పుడు అంటే మంచి ఉద్యోగం వచ్చినా, ఇంట్లో ఫంక్షన్ బాగా జరిగినా, కొత్త కారు కొన్న, కొత్త ఇల్లు కొన్న, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న చూసేవాళ్ళు ఓర్వలేరు. ఇది సహజంగా జరుగుతుంది. కానీ అవతల వాళ్ళు ఇలా చెప్పుకోవడం వల్ల దిష్టి తగులుతుంది.

వ్యక్తులకు గనుక దిష్టి తగిలినట్లయితే తలనొప్పి, నీరసం, ఏమీ తినాలనిపించకపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి. అప్పుడు కళ్ళు ఉప్పు తీసుకొని దిష్టి తగిలింది అనుకున్న వ్యక్తికి కుడివైపున మూడుసార్లు ఎడమవైపున మూడుసార్లు కిందికి పైకి ఆ ఉప్పుతో దిష్టి తీసి ఆ ఉప్పును బయట పారేయాలి. కాస్త సమయం తర్వాత అర్థం అవుతుంది దిష్టి తగిలిందా లేదా అనేది.

ఒకవేళ ఇలా చేసినా కూడా ఫలితం శూన్యం అని అనిపించినట్లయితే ఇప్పుడు ఉప్పుతో పాటు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు తీసుకొని కుడివైపున మూడుసార్లు ఎడమవైపున మూడుసార్లు కిందికి పైకి అని తర్వాత పైన తల భాగంలో మూడుసార్లు తిప్పి వాటిని బయట పారివేసి కాళ్లు చేతులు కడుక్కుంటే కాసేపటి తర్వాత దిష్టి అనేది వెళ్లిపోతుంది.

ఇలా చేసినా కూడా ఏమీ అనిపించకుంటే ఆ తర్వాత ప్రాణంతో ఉన్న చాపను ఒక గిన్నెలో వేసి కాస్త నీరు పోసి ఆ గిన్నెను కుడి వైపున మూడుసార్లు ఎడమవైపున మూడుసార్లు కిందికి పైకి అని తర్వాత తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ చేపను దిష్టి తగిలిన వ్యక్తితో సగానికి కట్ చేసి బయట పారేయాలి. ఇలా చేస్తే పూర్తిగా దిష్టి దోషం తొలగుతుంది.

ఇక ఇళ్లపై కూడా దిష్టి పడే ఆస్కారం ఉంది కాబట్టి ఇంటి గుమ్మానికి దిష్టిబొమ్మను, ఒక గుమ్మడికాయను కచ్చితంగా వేలాడదీయాలి. గుమ్మడికాయకు నీరు అనేది తగలకుండా కడితే మంచిది. నీరు తగిలితే గుమ్మడికాయ చెడిపోతుంది. గుమ్మడికాయ నీరు తగలకుండా చెడిపోతే ఆ ఇంటికి దిష్టి తగిలినట్టే. అప్పుడు ఆ ఇంటికి ముందు భాగంలో గుమ్మడికాయను కాస్త కుంకుమ వేసి కర్పూరం మిగిలించి రౌండ్ గా దిష్టి తీసినట్టుగా చేసి పగలగొట్టాలి. దీనితో దిష్టి తొలుగుతుంది.