ఆంధ్రప్రదేశ్: విజయనగరం… కొత్తవలస వాసి అయిన సురేష్ కుమార్… చాలా మంది రాజకీయ నేతలు కూడా చేయని ఓ పని చేసి… అందరి ప్రశంసలూ పొందుతున్నాడు. ఏం చేశాడంటే… వర్షాలతో రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతని తానే దగ్గరుండి పూడ్చాడు.
తనే స్వయంగా తన సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక, రాళ్లు కొన్నాడు. వాటిని తానే మిక్సింగ్ చేశాడు.తానే స్వయంగా రోడ్డుపై ఉన్న గతుకును పూడ్చాడు. తాపీ కార్మికులు ఎలాగైతే… ఆ పని చేస్తారో… అంతే ప్రొఫెషనల్ లా చేసి చూపించాడు.
ఓ కానిస్టేబుల్ కి వచ్చే శాలరీ ఎంత తక్కువగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది సురేష్ మాత్రం… సొంత ఖర్చుతో ఇలా సేవ చేయడం సంచలనం అయ్యింది. నలుగురూ ఈ విషయం తెలుసుకొని… అతన్ని మెచ్చుకుంటున్నారు. పోలీసులు ఇలా ఫ్రెండ్లీగా ఉంటే… ఈ సమాజంలో చాలా నేరాలకు బ్రేక్ పడుతుందంటున్నారు.
విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. ఊరికే ప్రశంసిస్తే సరిపోదనుకున్న ఉన్నతాధికారులు… ఇలా ప్రశంసా పత్రం ఇచ్చి… సురేష్ సేవా నిరతిని మెచ్చుకున్నారు.