కొత్త కారు కొన్న జబర్థస్త్ కమెడియన్… కారు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి వస్తున్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన వారిలో ఇమాన్యుయేల్ కూడా ఒకరు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఇమాన్యుయేల్ వరుస స్కిట్లు చేస్తూ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక వర్ష, ఇమాన్యుయేల్ ఇద్దరు జంటగా చేసిన స్కిట్ల వల్ల ఇమాన్యుయేల్ మరింత పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ కోసం వీరిద్దరూ ప్రేమికులుగా నటించటంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రేక్షకులు నమ్మారు. కానీ అదంతా కేవలం జబర్దస్త్ రేటింగ్స్ కోసమే అని తర్వాత అర్థం చేసుకున్నారు.

జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా ఇమాన్యుల్ సందడి చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా జబర్దస్త్ ఎలా వచ్చిన పాపులారిటీతో బయట ఈవెంట్లకు కూడా హాజరై బాగా డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో కూడా ఇమాన్యుయేల్ రెమ్యూనరేషన్ పెరిగినట్లు జబర్దస్త్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇలా టీవీ షోలు, ఈవెంట్ల వల్ల సంపాదించిన డబ్బుతో ఇమాన్యుయేల్ ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు.

తాజాగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. ఖరీదైన హ్యుందాయ్ వెన్యూ మైక్రో ఎస్యూవీ కారును ఇమ్మాన్యుయేల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇమాన్యుల్ కొనుగోలు చేసిన ఈ హై ఎండ్ వేరియంట్ కారు ధర రూ. 14 లక్షలు. ఇమ్మాన్యుయేల్ కొత్త కారు కొనుగోలు చేయటంతో జబర్దస్త్ అభిమానులు కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కామెడీ షో ల ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన ఇమాన్యుయేల్ కి సినిమాలలో కూడా నటించే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీని వదిలి వెళ్ళకుండా ఆ అవకాశాలను ఇమాన్యుల్ వదులుకున్నట్లు సమాచారం.