Gallery

Home News సూర్య ఆ సినిమా చేసి చాలా మంచి పనే చేశాడు

సూర్య ఆ సినిమా చేసి చాలా మంచి పనే చేశాడు

Suriya Did Good Job By Doing Surarai Pottru
దక్షిణాదిన ఉన్న ఉత్తమ నటుల్లో సూర్య ఒకరు.  ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేస్తాడనే పేరుంది సూర్యకు.  ఆయన నటనకు గాను ఇప్పటికే పలు అవార్డులు ఆయన్ను వరించాయి.  కానీ గత కొన్నేళ్ళుగా సూర్యకు సరైన హిట్ అనేది లేదు.  పలు సినిమాలు ఫ్లాప్ కాగా ఇంకొన్ని అరకొర ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  అలా నీరసంగా నడుస్తున్న ఆయన కెరీర్ ఇప్పుడు ఊపందుకుంది.  అందుకు కారణం ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం.  సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.  ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.  
 
విమర్శకులు సైతం చిత్రానికి కితాబిచ్చారు. ఏయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా అన్ని విధాలుగా ఆకట్టుకుంది. ఈ చిత్రం మ‌న‌దేశం త‌ర‌పున ఈ చిత్రం 93వ ఆస్కార్ నామినేష‌న్స్ ప‌రిశీల‌న‌కు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు కూడా ఈ సినిమా ఎంపికైంది. ఇప్పుడు మ‌రో అంత‌ర్జాతీయ సినీ చిత్రోత్స‌వానికి ఎంకైంది.  ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వ‌ర‌కు జ‌రిగే షాంగై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పనోరమా విభాగంలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.  మొత్తానికి ఈ సినిమా చేసి సూర్య చాలా మంచి పనే చేశారు.  నటుడిగా ఇంకో పది మెట్లు పైకెడిగారు ఆయన.  
- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News