Health Tips:మూర్ఛ వ్యాధితో బాధ పడుతున్నారా ?నిద్రపోయేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే చాలా ప్రమాదం..!

Health Tips:మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే సరైన ఆహారం, తగినంత నిద్ర ఎంతో అవసరం. చాలామంది నిద్ర పట్టక అవస్థలు పడుతుంటారు. అయితే డాక్టర్ల సలహా మేరకు రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలట. ప్రతి రోజు ఎనిమిది గంటల నిద్ర పోవడం వల్ల శరీరానికి, మెదడుకు, జీర్ణవ్యవస్థకు తగినంత విశ్రాంతి దొరికి ఆరోగ్యవంతంగా, ఎంతో యాక్టివ్ గా పనిచేస్తాయి. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు నిద్రలో మరణించే అవకాశం చాలా ఎక్కువ ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.

ముఖ్యంగా మూర్ఛ వ్యాధితో బాధ పడేవారు నిద్రలో మరణించే అవకాశాలు ఉన్నట్టు డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రపంచంలో దాదాపు 50 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మూర్ఛ వ్యాధితో బాధ పడేవారు నిద్రించేటప్పుడు బోర్లా పడుకోకూడదట, ఒత్తిడి వల్ల కొన్నిసార్లు మరణించే అవకాశం ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మూర్ఛ వ్యాధితో బాధపడే చాలా మంది పిల్లలు ఇలా పడుకోవడం వల్ల మరణించినట్లు గుర్తించారు. ఇల్లినాయిస్ లోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేమ్స్ టావో ఏమన్నారు అంటే….. 253 మంది మూర్ఛ వ్యాధిగ్రస్తుల మీద ఈ అధ్యయనం జరిపారు, ఇందులో 73 శాతం మంది బోర్లా పడుకోవడం వల్లే మరణించారని ఆయన తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా మూర్ఛ వ్యాధితో బాధపడుతుంటే, బోర్ల పడుకోవద్దు అని వారికి సూచించండి.

మూర్ఛ వచ్చినప్పుడు చేయవలసిన ప్రాథమిక చికిత్స…..
• సీతాఫలం ఆకుల ను నలిపి వాసన చూపించడం వల్ల మూర్ఛ తో పడిపోయిన వ్యక్తి కి మెలుకువ వస్తుంది.
• తులసి ఆకు రసం, సైంధవ లవణంతో కలిపిన మిశ్రమాన్ని ఒకటి లేదా రెండు చుక్కలు వేస్తే మూర్ఛ కలిగిన వ్యక్తికి మెలకువ వస్తుంది.
• ఉల్లి రసం ముక్కులో వేసినా కూడా ఫలితం వస్తుంది.
• పిల్లల్లో తరచుగా వచ్చే ముర్చకు వస కషాయం తో స్నానం చేయించాలి.
• కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడటం వల్ల మంచి ఫలితం లభించే అవకాశం ఉంది.
• పసుపు పొడి కూడా మూర్ఛ వ్యాధికి బాగా పని చేస్తుంది. పసుపు పొడి పొగ వేసినా కూడా మూర్ఛ నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

ఈ మూర్ఛ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది కనుక డాక్టర్ సలహాలను పాటించడం మంచిది.