ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కరివేపాకును చాలామంది సువాసన కోసమే అని భావించి తినకుండా పక్కన పడేస్తుంటారు. అది పొరపాటే! ఎందుకంటే కరివేపాకులో మన శరీర పెరుగుదలకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి,ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే
మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E ,యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ గుణాలు మనలో ఇమ్యూనిటీ శక్తిని పెంచి సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును ప్రతిరోజూ ఆహారంలోను మరియు టి , కషాయం రూపంలో తీసుకోవడం వల్లభవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
కరివేపాకులో సమృద్ధిగా ఉన్న విటమిన్ ఎ కంటి
సమస్యలను దూరంచేసి కంటిచూపును మెరుగు పరుస్తుంది. అలాగే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ ఈ
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది
నీటిలో కరివేపాకును బాగా మరిగించి కాస్త నిమ్మరసం,చక్కెర కలిపి ‘టీ’ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి అతి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.కరివేపాకులో ఉండే అరోమా నరాల్ని రిలాక్స్ చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది
కరివేపాకులో ఉన్న ఔషధగుణాలు క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది.దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి ప్రమాదకర డయాబెటీస్ వ్యాధి నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందవచ్చు.
కరివేపాకులో అధికంగా ఉన్న ఐరన్, ఫైబర్, ఫోలిక్‌యాసిడ్ ప్రమాదకర రక్తహీనత, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యల,గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ వంటి ప్రమాదకర క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.