రాగి చిరుధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే… ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం?

భారతీయ సాంప్రదాయ వంటకాల్లో చిరుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. చిరుధాన్యా లైన రాగులు, కొర్రలు, సద్దలు, జొన్నలు వంటి వాటిల్లో మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానిక అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఈరోజు మనం చిరుధాన్యాల్లోని ముఖ్యమైన రాగులు వాటిలో సహజ సిద్ధంగా లభించే పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన రాగి అంబలి తయారీ విధానం గురించి కూడా తెలుసుకుందాం.

మన ప్రతిరోజు తీసుకుని బియ్యం ,గోధుమల్లో కంటే రాగి చిరుధాన్యంలో మన శరీర పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం, ఐరన్ ,జింక్ ,ఫాస్ఫరస్ వంటి మూలకాలు దాదాపు 35 రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే పోషకాహార లోపాన్ని తొలగించుకోవచ్చు.రాగి చిరుధాన్యంలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకల అరుగుదలను నివారించి దృఢంగా ఉంచినట్లు చేస్తుంది. రాగుల్లో పుష్కలంగా ఉన్న ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.

ప్రతిరోజు ఒక్క గ్లాస్ రాగి అంబలి తాగితే రాగుల్లో పుష్కలంగా ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం త్వరగా జీర్ణం అవ్వదు.కడుపు నిండిన భావన కలిగి ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తగ్గించుకోవచ్చు. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది తద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది..మొలకెత్తిన రాగులలో రోగ నిరోధక శక్తి వచ్చే విటమిన్-సి సమృద్ధిగా ఉండి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

రుచికరమైన వేడివేడి రాగి అంబలి లేదా రాగి జావాను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట రాగులను 12 గంటల పాటు నానబెట్టి తర్వాత తడి బట్టలో మొలక గట్టి ఉంచితే మరొకటి రోజు రాగులన్నీ మొలకెత్తుతాయి. ఇలా మొలకెత్తిన రాగులను నీడలో ఆరబెట్టి పొడిగా మార్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రాగి పొడిని
రాగి మాల్ట్‌ పౌడర్‌ అని కూడా అంటారు. ఈ పొడిని పాలు లేదా నీటిలో కలిపి బాగా మరగనిచ్చిన తర్వాత ఉప్పు లేదా పంచదార కలిపితే మీకు ఇష్టమైన వేడి వేడి రాగి జావా తయారైనట్టే. ఈ రాగి జావా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.