రోజూ మీరు చికెన్ తింటున్నారా.. చికెన్ తింటే ఆ ప్రమాదకరమైన సమస్యలు వస్తాయా?

సాధారణంగా తినే మాంసాహారాలలో కోడి మాంసం ఒకటనే సంగతి తెలిసిందే. దీనినే చికెన్ అని కూడా పిలుస్తారు. చికెన్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఎంతో ఇష్టపడి తింటారని చెప్పాల్సిన అవసరం లేదు.. ఇతర మాంసాలతో పోలిస్తే చికెన్ సరసమైన అందుబాటు ధరలో లభిస్తుందని చెప్పవచ్చు. దీంతో చాలా మంది కనీసం వారానికి ఒక్కసారైనా తినడానికి ఆసక్తి చూపిస్తారు. కొంతమందికి అయితే, ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు రోజూ తినేవారు కూడా ఉన్నారు. ఫాస్ట్ ఫుడ్ల తయారీల్లోను కోడి మాంసం ఓ ముఖ్యమైన పదార్ధంగా ఉపయోగిస్తున్నారనే సంగతి తెలిసిందే.

చికెన్ తినడం వల్ల మన శరీరంలో ప్రొటీన్స్ పెరుగుతాయని చెప్పవచ్చు.. ప్రొటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే సంగతి తెలిసిందే.. తద్వారా అనేక రకాల వైరస్ లను ఎదుర్కోనే శక్తి మన శరీరానికి వస్తుందని చెప్పవచ్చు. అయితే ఫారం కోళ్ళను తినటం వల్ల అనారోగ్యం పాలవుతారని నిపుణులు చెబుతున్నారు. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చికెన్ ను ఎక్కువ మోతాదులో తినడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.. సాధారణంగా చికెన్‌ తింటేనే మన బాడీలో ప్రోటిన్స్‌ లెవల్‌ పెరుగుతాయఅని చెప్పవచ్కు.. ఈ ప్రోటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వారానికి రెండు మూడు సార్లు చికెన్‌ తింటే ఫర్వాలేదు కానీ, వారంలో 3 లేదా 4 సార్ల కంటే ఎక్కువ సార్లు తింటే అటువంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తప్పవు.

ప్యాకెట్లలో లభించే ప్రాసెస్డ్‌ చికెన్‌ కంటే మనం తెచ్చుకుని వండుకోవడం మేలని చెప్పవచ్చు. అయితే చికెన్‌ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం నిపుణులుఎంతో మంచిదంటున్నారు . రోజుకు 170 గ్రాములకు మించి తినకూడదని వెల్లడిస్తున్నారు. అంతకంటే ఎక్కువ తింటే, ఫుడ్‌ పాయిజనింగ్, డయేరియా, ఇంకా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.