సాధారణంగా కొంతమందిలో కాలంతో ఏమాత్రం సంబంధం లేకుండా తరచూ కాళ్లు పగలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా పాదాలు వెనుక భాగంలో కరుకుగా ఏర్పడి పగలడం మరి కొంతమందిలో ఈ పగుల్ల కారణంగా తీవ్రమైన మంట నొప్పి కలిగి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఉంటుంది.మహిళల్లో ఇలా పాదాల పగులు ఎక్కువగా ఉండటానికి గల కారణం వాళ్ళు ఇంటి పనులలో పడి తమ పాదాలను రక్షించుకోవడం పూర్తిగా మానేస్తుంటారు. తద్వారా వారిలో ఇలాంటి పగుళ్లు ఎక్కువగా కనపడుతుంటాయి.
ఈ విధంగా పాదాల పగుళ్లు ఏర్పడిన వారు ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా సింపుల్ మార్గాలు ఉన్నాయి. అయితే ముందుగా ఇలా పాదాలు ఎందుకు పగులుతాయనే విషయానికి వస్తే మనం పనులు చేస్తున్న సమయంలో మన శరీర బరువును మొత్తం పాదాలు మోస్తాయి. అయితే కొన్నిసార్లు మన పాదాలకు సరిపడా రక్తప్రసరణ జరగని పక్షంలో పాదాలు వెనుక భాగంలో ఎండిపోయినట్టు జరిగి పగుళ్లు ఏర్పడతాయి. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే పాదాలకు కూడా రక్తప్రసరణ సరైన మార్గంలో జరిగినప్పుడే ఈ పాదాల పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇలా ఈ పాదాల పగుల సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు కాలనీ శుభ్రం చేసుకుని కొబ్బరి నూనెతో బాగా మర్దన చేయాలి ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.లేదా పడుకునే ముందు పావుగంట పాటు చల్లనీటిలో కాళ్ళను ఉంచి కాలను బాగా రుద్దటం వల్ల మన పాదాలలో ఉన్నటువంటి మృత కణాలు తొలగిపోయి ఈ పగుళ్ళ సమస్య తగ్గిపోతుంది. ఇక పైనాపిల్ను బాగా మిశ్రమంలో తయారు చేసి ఒక చల్లనీటి గిన్నెలో వేసే దాదాపు అరగంటకు పైగా పాదాలను ఆ గిన్నెలో పెట్టడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలను బాగా మర్దన చేయటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి ఈ పాదాల పగుల్ల నుంచి బయటపడవచ్చు.