వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో జుట్టు సమస్య కూడా ప్రధానమైనది గాని చెప్పవచ్చు. చిన్న వయసులోనే బట్టతల, తెల్ల వెంట్రుకలు, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.ఈ సమస్య నుంచి బయట పడటం కోసం మార్కెట్లో లభించే అన్ని ప్రొడక్టులను ఉపయోగించి ఎలాంటి ఫలితం లేకుండా పోతుందా. మన పూర్వీకులు జుట్టు సమస్యలకే కాకుండా చర్మ సమస్యలను తొలగించుకోవడానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగించేవారు. కొందరిలో జుట్టు రాలడానికి మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, బరువు పెరగడం, వంశ పారంపర్యంగా కూడా ఇలా జరగవచ్చు.
ముఖ్యంగా శీతాకాలంలో అల్ప ఉష్ణోగ్రతల కారణంగా చర్మం పొడిబారడం చుండ్రు సమస్య తలెత్తడం వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో చెక్ పెట్టవచ్చు. గానుగ పట్టిన కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మరీ మంచిది. కొబ్బరినూనెలో జిగట ద్రవపదార్థం ఇది మన శరీరంలో సహజంగా ప్రవహించే సెబమ్ ను పోలి ఉంటుంది. అప్పుడప్పుడు కొబ్బరి నూనెను తలపై మర్దన చేసుకుంటే చర్మం పొడిబారకుండా కాపాడి జుట్టు కుదురులను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం జుట్టులోని ప్రొటీన్లను బంధించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని కావాలి తెల్ల వెంట్రుకల సమస్యను కూడా నివారిస్తుంది.
కొబ్బరి నూనెలు సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ అలర్జిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అప్పుడప్పుడు తల వెంట్రుకలకు కొబ్బరి నూనెను మసాజ్ చేసుకుంటే తల చర్మంపై ఉన్న హానికర సూక్ష్మజీవులు నశించి తలలో గాయాలను, చుండ్రును తొలగించడంతోపాటు జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చలి వాతావరణం కారణంగా చర్మం పొడి వారి చర్మా మృత కణాల సంఖ్య పెరిగిపోతుంది. కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల మృత కణాలను తొలగించి చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. తరచూ కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి తలనొప్పి, తల భారం, కండ్ల మంటలు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.