వేసవికాలం మొదలవడంతో మనకు మార్కెట్లో ఎక్కడ చూసిన పుచ్చకాయలు దర్శనమిస్తున్నాయి వేసవికాలంలో ఎక్కువగా చాలామంది డిహైడ్రేషన్కు గురవుతుంటారు ఇలా డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే నీటి శాతం అధికంగా కలిగినటువంటి పుచ్చకాయలు కీర దోసకాయలు వంటి పండ్లను తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక మార్కెట్లో అందుబాటులోకి వచ్చినటువంటి పుచ్చకాయలను చాలామంది అలాగే తినడం లేదా జ్యూస్ తయారు చేసుకొని తినడం వంటివి చేస్తుంటారు.
ఇక ఈ పండ్లను తినేటప్పుడు చాలామంది అందులో ఉన్నటువంటి విత్తనాలను తీసి పడేగా మరికొందరు వాటితోపాటు జ్యూస్ తయారు చేసుకునే తాగుతూ ఉంటారు ఇలా విత్తనాలతో సహా తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఇలా గింజలతో పాటు పుచ్చకాయను తినడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
పుచ్చకాయలు సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం,మెగ్నీషియం అమినో ఆమ్లాలు సమృద్ధిగా లభ్యమవుతాయి. కావున తరచు పుచ్చకాయ రసాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.
పుచ్చకాయలో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం, పొటాషియం మూలకాలు రక్త ప్రసరణ వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. పుచ్చకాయను గింజల తో పాటు జ్యూస్ తయారు చేసుకొని సేవిస్తే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వ్యాధికారక మరియు క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడతాయి, మరియు హై బీపీ సమస్యను కూడా అదుపులో ఉంచుతాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే పుచ్చకాయను గింజలతో సహా తినడం ఎంతో మంచిది.