శీతాకాలంలో ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

శీతాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే అతి మధురమైన సీతాఫలం పండ్లను తినే విషయంలో అనేక అపోహలు దాగి ఉన్నాయి. శీతల వాతావరణం లో సీతాఫలం పండును తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కొందరు వీటిని తినడానికి సంకోచిస్తుంటారు.అది కేవలం అపోహ మాత్రమే సీజనల్ గా లభించే ప్రతి పండులోనూ మన ఆరోగ్యాన్ని పరిరక్షించే అన్ని ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సీతాఫలం పండ్లలో అత్యధికంగా విటమిన్ సి, ఫైబర్ , కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కావున వీటిని మోతాదుకు మించి ఆహారంగా తీసుకుంటే కొందరిలో జలుబు, దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థలో వ్యత్యాసం ఏర్పడి గ్యాస్టిక్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. సీతాఫలం పండ్లలో అత్యధికంగా క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అతి బరువు సమస్యతో బాధపడేవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒక పండు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అంతేకానీ సీతాఫలం పండ్లను ఆహారంగా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.

సీతాఫలం పనులను తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీతాఫలం గుజ్జులో అధికంగా ఐరన్,సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి అనీమియా సమస్యను దూరం చేస్తుంది.కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచి కీళ్ల నొప్పులు సమస్యలను దూరం చేస్తుంది. సల్ఫర్ అనేక చర్మ సమస్యలను దూరం చేసి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ పండ్లలో అత్యధికంగా ఉన్న పొటాషియం గుండె ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. మెగ్నీషియం, జింకు నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు చురుగ్గా పని చేయడంతో పాటు ఒత్తిడి తగ్గించి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. సీతాఫలం పండ్లలో అత్యధికంగా ఉన్న ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.