ముల్లంగిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ముల్లంగి అందరికీ అందుబాటులో ఉండే కూరగాయ అయినప్పటికీ వీటిలో ఉండే ఘాటైన సువాసన కారణంగా ముల్లంగిని తినడానికి చాలామంది ఇష్టపడరు. ముల్లంగిలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలోని వ్యాధి కారకాలను నశింపజేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముల్లంగిలో 90% నీరు,
8% కార్బోహైడ్రేట్లు, 2% ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ముల్లంగిలో అత్యధికంగా మిటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , మాంగనీస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ముల్లంగిలో 24% విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల దీన్ని ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకుంటే మనలో ఇమ్యూనిటీ సిస్టం బాగా అభివృద్ధి చెంది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. శీతాకాలంలో తరచూ వచ్చే జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించి బ్రాంకైటిస్, ఆస్తమా, ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను అదుపు చేస్తుంది.

ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫోలిక్
యాసిడ్ , యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు ముల్లంగి జ్యూస్ ను సేవిస్తే మన శరీరంలో నీ క్యాన్సర్ కణాలను నివారించి లివర్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ముల్లంగిలో ఉన్న ఔషధ గుణాలు కిడ్నీ పనితీరును మెరుగుపరిచి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి సహాయపడుతుంది.
మలబద్ధక సమస్యతో బాధపడేవారు తరచూ ముల్లంగిని ఆహారంలో చేర్చుకుంటూ వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

ముల్లంగిలో పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధికంగా ఉన్నందున మన శరీరంలో రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ముల్లంగి లోని ఔషధ గుణాలు కాలేయ పనితీరు మెరుగుపరిచి ఇన్సులిన్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది దాంతో రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.