ప్రతిరోజు నెయ్యిని ఆహారంగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతిరోజు మనం తినే ఆహారంలో కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే చాలామంది నెయ్యిని ఆహారంగా తీసుకుంటే శరీర బరువు పెరిగి గుండె సమస్యలతో బాధపడాల్సి వస్తుందని నెయ్యిని తినటానికి సంకోచిస్తుంటారు . ఇది అపోహ మాత్రమే ప్రతిరోజు కొంత నెయ్యిని ఆహార పదార్థాలతో కలుపుకొని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యిలో మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తొలగించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు మనం తినే ఆహారంలో నెయ్యిని కలుపుకొని తింటే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగించి అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది. అలాగే రక్త నాళాలను శుభ్రపరిచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కే, కాల్షియం ,బ్యూట్రిక్ యాసిడ్, పుష్కలంగా లభిస్తాయి ప్రతిరోజు ఆహారంలో నెయ్యిని తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు విటమిన్ డి ,కాల్షియం ఎముకల్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరిచి కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
విటమిన్ ఈ చర్మంపై ముడతలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం పరగడుపున కొంత నెయ్యిని సేవిస్తే నెయ్యిలో పుష్కలంగా ఉన్న అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ జీర్ణాశయ సమస్యలను తొలగించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నెయ్యిని పరిమితికి మించి తీసుకుంటే అమృతంలా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మోతాదుకు మించి నెయ్యిని ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది.