చురుకైన మెదడు కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం రెండు శాతం మాత్రమే ఉంటుంది. కానీ గుండె నుండి పంప్ అయిన రక్తం 15 శాతం దీనికి చేరాల్సిందే. మనం పీల్చే ఆక్సిజన్ లో 20% మెదడు స్వీకరిస్తుంది. మన కోసం తయారయ్యే శక్తిలో ఐదవ వంతు మెదడు వినియోగించుకుంటుంది. మెదడు సక్రమంగా పనిచేయాలంటే ఇవన్నీ సమృద్ధిగా లభించాలి.

మెదడు చిన్నదే అయినప్పటికీ, తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలిక, మన ప్రతి ఆలోచన, మన ప్రతి పని లెక్క ప్రకారం మెదడువే. ఇంత విలువైన మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే తగిన ఆహార నియమాలు కచ్చితంగా పాటించాల్సిందే. వాల్ నట్స్ లోని పోలిఫినాల్స్, న్యూరాన్స్ ఇంకా బ్రెయిన్స్ మధ్య కమ్యూనికేషన్ ను అభివృద్ధి చేస్తుంది.

ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం ద్వారా 19% మన బ్రెయిన్ ను మెరుగుపరచుకోవచ్చు. కాఫీలోని కెఫిన్ మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు కానీ ఒకటి లేదా రెండు కప్పుల వరకు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

చేపలు మెదడును చురుకుగా ఉండే విధంగా చేస్తాయి. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. గ్రీన్ లీఫ్ లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని రక్తనాళాలకు అవసరమయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో ఉండడం ద్వారా వారానికి రెండు లేదా మూడుసార్లు ఆకుకూరలు తినడం మంచిది.

ఆలివ్ ఆయిల్ ను వాడడం ద్వారా కీళ్లు మరియు మెదడు కణాలకు ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిఫినాయిల్స్ అధికంగా కలిగి ఉండటం ద్వారా ఆహార పదార్థాలలో వాడడం మంచిది. ప్లాక్ సీడ్స్ చూడడానికి చిన్నగా ఉన్న ఇందులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ విత్తనాలు బ్రెయిన్ పవర్ పెరగడానికి బాగా సహాయపడతాయి.

వీటిని పెరుగులో మిక్స్ చేసుకొని తినవచ్చు. స్ట్రాబెరీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు ఇంకా మెమోరీని రక్షించే కొన్ని కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా మెదడు చరుగ్గా పనిచేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే నీళ్లు అవసరం రోజుకి కనీసం 8 గ్లాసులకు తగ్గకుండా నీటిని త్రాగాలి. ఈ ఆహార పదార్థాల వల్ల మెదడు మానసిక ఒత్తిడికి దూరమై మెరుగుగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటుంది.