జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో బెండకాయ ఉపయోగం ఎంతో తెలుసా?

బెండకాయను ఎక్కువగా తింటే లెక్కలు బాగా వస్తాయని తరచూ వినిపించే మాట. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ బెండకాయలో ఉన్న పోషక విలువలు,ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ఈ వాక్యం అక్షర సత్యం అని అర్థమ వుతుంది. బెండకాయలో అత్యధిక ఫైబర్,ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్
పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, కాపర్, సెలీనియం వంటి సహజ పోషకాలతో పాటు విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి.

ముఖ్యంగా బెండకాయలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఫ్యాట్‌ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే బెండకాయలో వాటర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ అధిక మోతాదులో ఉండడం వల్ల మన రోజువారి ఆహారంలో బెండకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేయబడింది. బెండకాయ పులుసు, బెండకాయ పచ్చడి, బెండకాయ కర్రీ , బెండకాయ బజ్జి వంటి అనేక రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయలోని సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు,ప్రొబయాటిక్స్‌ , సెలీనియం మెగ్నీషియం
వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు ప్రమాదకర అల్జీమర్ వ్యాధిని నియంత్రించి జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో బెండలోని ఫ్లేవనాయిడ్లు కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చాలాసార్లు స్పష్టం చేశారు. అందుకేనేమో బెండకాయను తింటే లెక్కలు బాగా వస్తాయని మన పెద్దవారు చెబుతున్నారు.

ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళలు బెండకాయను ఆహారంగా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉన్న ఐరన్, పోలేట్, పోలిక్ యాసిడ్ వంటి సహజ గుణాలు కడుపులోని బిడ్డ మెదడు, నాడీ కణ వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. బెండకాయ లో ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడి పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లను అదుపు చేయడంలో సహాయపడతాయి. బెండకాయలు సమృద్ధిగా ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలోనూ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలోనూ సహాయపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.