భోజనం తిన్న వెంటనే తమలపాకు తాంబూలాన్ని తినడానికి అసలు కారణాలేంటో తెలుసా?

మన భారతీయ సంప్రదాయంలో తమలపాకు కు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో తమలపాకును ఎక్కువగా వినియోగించడంతోపాటు మన భారతీయ సంప్రదాయంలో భోజనం తర్వాత తమలపాకు తాంబూలాన్ని తీసుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఈ పద్ధతి వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది అన్నది చాలామందికి అవగాహన లేకపోవచ్చు. తమలపాకులో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు, ఔషధ విలువలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు తమలపాకును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలామంది తమ ఇంటి పెరట్లో తమలపాకు మొక్కలను కూడా పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు దీనివల్ల ఇంటి పరిసరాల్లో ఉండే నెగటివ్ వైబ్రేషన్ తొలగిపోయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ముఖ్యంగా ప్రతిరోజు తమలపాకును నమిలి రసాన్ని మింగితే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సీ,శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్
థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ వంటి సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో లభ్యమవుతాయి. అలాగే మన శరీరంలోని అన్ని క్యాన్సర్ కణాలను నియంత్రించే యాంటీ క్యాన్సర్ గుణాలు,ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు, క్వినోన్లు తమలపాకు రసంలో సమృద్ధిగా లభిస్తాయి.

విందు వినోదాల భోజనం తర్వాత తమలపాకు తాంబూలం తినడానికి ముఖ్య కారణం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా గ్యాస్టిక్, మలబద్దకం , ఎసిడిటీ సమస్యలను కూడా తగ్గిస్తుంది.అలాగే కడుపు, ప్రేగులలో పిహెచ్ స్థాయిలను క్రమబద్దీకరించడానికి తమలపాకు రసంలో ఉన్న ఔషధ గుణాలు ఎంతగానో తోడ్పడతాయి. డిప్రెషన్ ఆందోళన చిరాకు వంటి సమస్యలతో బాధపడేవారు తమలపాకు రసాన్ని సేవిస్తే మెదడు ప్రశాంతత కలిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తమలపాకును తిన్నప్పుడు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు నోట్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి నోటి దుర్వాసన, దంత క్షయం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.