ఈరోజుల్లో చెప్పులు వేసుకోకుండా ఇంట్లోంచి బయటికి అడుగు కూడా పెట్టరు. ఇంకొందరైతే ఇంట్లోనే చెప్పులు వేసుకొని మరీ తిరుగుతుంటారు. పాతకాలం రోజుల్లో కాళ్లకు చెప్పులు వేసుకోకుండానే గ్రామాల్లో తిరుగుతూ వ్యవసాయ పనులు కూడా చేసుకునేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి కనపడదు.చెప్పులు వేసుకోకుండా నడవడం కూడా కష్టంగా మారింది దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ రోజుల్లో పట్టణాల్లో జీవించేవారు చెప్పులు లేకుండా నడవడం కొద్దిగా కష్టమే ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న చెత్తా భూమి కాలుష్యం డ్రైనేజీ సమస్య వంటి కారణాలవల్ల చెప్పులు లేకుండా నడిస్తే అనేక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కాకుండా కనీసం ఇంట్లో లేదా ఇంటి చుట్టూ పెరట్లో తిరుగుతున్నప్పుడు అయినా చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం చెప్పులు లేకుండా నడిచే వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు సహజ పద్ధతిలోనే తొలగిపోతున్నాయని చెబుతున్నారు
కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల అరికాళ్ళలో ఉన్న నరాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే కండరాలు దృఢంగా మారి కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అరికాళ్లలో మంటలు వంటి అనేక సమస్యలు తొలగిపోతాయి. అధిక ఒత్తిడి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తరచు చెప్పులు లేకుండా నడిస్తే బాడీ రిలాక్స్ అవుతుంది తద్వారా నిద్రలేమి సమస్య అధిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎప్పుడు చెప్పులు వేసుకుని నడిచే వారితో పోలిస్తే చెప్పులు వేసుకోకుండా నడిచే వారిలోనే ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.