ఈ లక్షణాలు మీలో ఉన్నాయా…. ఈ వ్యాధి బారిన పడబోతున్నట్లే?

Mature Woman Doing Blood Sugar Test at home.

ఈ రోజుల్లో చిన్న ,పెద్ద లేకుండా జీవితకాలం పాటు ప్రతి ఒక్కరిని వేధించే సమస్య షుగర్ వ్యాధి. ఆదిలోనే గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేయవచ్చు. కొంత మందిలో షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నా వాటిని గుర్తించడానికి చాలా రోజులు పడుతుంది. షుగర్ వ్యాధికి మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు తీవ్రస్థాయిలో పెరిగి రక్తంలోనీ గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.

షుగర్ వ్యాధి ఎవరిలో వచ్చే ప్రమాదం ఉందో కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా గాయాలు అయినప్పుడు త్వరగా మానకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం,కంటి చూపు మందగించడం,కాళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి షుగర్ వ్యాధి బారిన పడితే జీవిత కాలం మందులు వాడాల్సిందే. షుగర్ వ్యాధి రావటానికి ప్రధాన కారణం ఒంట్లో శక్తిని ఖర్చు చేయకపోవడమే. అందుకే కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే డయాబెటిస్, రక్త పోటు, బరువు పెరగడం, కీళ్ల నొప్పులు లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి భవిష్యత్తులో రక్షణ పొందవచ్చు.

ముఖ్యంగా ప్రతిరోజు పాలిష్ చేసిన బియ్యానికి బదులు తృణధాన్యాల రాగులు, జొన్నలు, కొర్రలు, ఊదరా వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే చక్కర స్థాయిలు ఎక్కువగా ఉండే శీతల పాలయాలు, చాక్లెట్స్, పండ్ల రసాల జోలికి అసలు వెళ్ళకూడదు. ఒకేసారి కడుపునిండా ఆహారాన్ని తీసుకునే బదులు కొద్దికొద్దిగా తీసుకోవడం ఉత్తమం. మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలను వదిలించుకోవాలి. మన నిండు జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.