శృంగారం అనేది ఒక మనిషికి మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పని ఒత్తిడి కారణంగా చిరాకు పడుతున్న వాళ్లు తమ జీవిత భాగస్వామితో కలిసి సెక్స్ లో పాల్గొనడం వల్ల వారు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. అయితే వయసు పై పడే కొద్ది సెక్స్ లో పాల్గొనాలని కోరికలు పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. అయితే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే.
ఐదు పదుల వయసులో కూడా వారానికే కనీసం ఒకటి లేదా రెండు సార్లు అయినా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…వారానికి ఒకసారి కన్నా రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో కొన్ని పోర్టు సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఎవరైతే మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.