బీన్స్ ను రోజువారి ఆహారంలో తీసుకుంటే కలిగే ఆరోగ్యం ప్రయోజనాలు ఏంటో తెలుసా?

మన శరీర పెరుగుదలకు, దృఢత్వానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ బీన్స్ లో సమృద్ధిగా లభిస్తాయి. కావున బీన్స్ ను వారానికి రెండు లేదా మూడుసార్లు తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బీన్స్ లో కొవ్వు నిల్వలు తక్కువగా ఉండి ఫైబర్ అత్యధికంగా లభ్యమవుతుంది.కావున అతి బరువు సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా బీన్స్ ను రోజు వారి ఆహారంలో తీసుకున్నట్లయితే శరీరంలోని చెడు మలినాలను తొలగించి శరీర బరువును నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడుతుంది

షుగర్ వ్యాధిగ్రస్తులు రోజువారి ఆహారంలో బీన్స్ ను తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న విటమిన్ సి, ఫైబర్,సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ సులువుగా జీర్ణమై రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధక సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు బీన్స్ ను ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని చెడు మలినాలను తొలగిస్తుంది.

బీన్స్ లో విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కాపర్ ,జింక్ వంటి సహజ మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున రోజువారి ఆహారంలో బీన్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎముకలు కండరాలు దృఢంగా తయారై వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు, కండరాల వాపు, ఆర్థరైటిస్, రుమటాయిడ్ వంటి సమస్యలను అదుపు చేయవచ్చు. బీన్స్ లో అత్యధికంగా ఉండే ప్లేవనాయిడ్స్ శరీరంలో క్యాన్సర్ కారకాలను తొలగిస్తుంది.

బీన్స్ లో సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్సు, పొటాషియం, కోలేట్, మెగ్నీషియం లభిస్తాయి ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బీన్స్ లో సెలీనియం మాంగనీస్ వంటి సహజ గుణాలు ఉండటంవల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొందించి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తాయి. ప్రతిరోజు బీన్స్ ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా ఉన్న ఐరన్ రక్తంలో హిమోగ్లోబిని ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అలాగే మెదడు చురుకుదనాన్ని పెంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.