బెండకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా… తెలిస్తే ఆశ్చర్యపోతారు!

500-okra-red-f1-hybrid-vegetable-seeds-ladies-finger-500-x-seeds-original-imag3rtwytz37nnf

ప్రోటీన్స్ అత్యధికంగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉండే బెండకాయలో మన ఆరోగ్యాన్ని రక్షించే అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.ముఖ్యంగా బెండకాయలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ బి12, పొటాషియం, ఫైబర్,క్యాల్షియం, మాంగనీస్, కాపర్, సెలీనియం వంటి పోషకాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. కావున మన రోజువారి డైట్ లో బెండకాయతో రుచికరమైన కర్రీ , పచ్చడి, పులుసు బజ్జి వంటివి తయారు చేసుకొని నిక్షేపంగా తినొచ్చు.బెండకాయలో ప్రొబయాటిక్స్‌ ఎక్కువే కావున మన ఆరోగ్యాన్ని రక్షించే బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది.

బెండకాయను తరుచు మన ఆహారంలో తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.విటమిన్ కె, పొటాషియం రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా హై బీపీ, గుండె జబ్బు సమస్యలను నియంత్రణలో ఉంచుతుంది.బెండకాయలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు,ప్రొబయాటిక్స్‌ , సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నందున మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు ప్రమాదకర అల్జీమర్ వ్యాధిని నియంత్రించి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బెండకాయ లో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది.

బెండకాయ లో ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నియంత్రించి భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళలు బెండకాయను ఆహారంగా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉన్న ఐరన్, పోలేట్, పోలిక్ యాసిడ్ వంటి సహజ గుణాలు కడుపులోని బిడ్డ మెదడు, నాడీ కణ వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది.బెండకాయలో సమృద్ధిగా ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి ఉబకాయం అతి బరువు సమస్యను నియంత్రిస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.